ఓవర్సీస్ లో చాలా స్టేబుల్ గా కలెక్షన్స్ రాబట్టే హీరోల్లో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అత్యధిక వన్ మిలియన్ డాలర్స్ సినిమాలు మహేష్ బాబు పేరు పైనే ఉంటాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మహేష్ బాబుకి చాలా స్ట్రాంగ్ రీజియన్. ఇక్కడ ప్రీమియర్స్ నుంచే రికార్డులు సెట్ చేయడం మహేష్ కి అలవాటైన పని. ఎప్పటిలాగే ఈసారి కూడా గుంటూరు కారం సినిమాతో డే 1+ప్రీమియర్స్ తో మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేసాడు. ఫస్ట్ వీకెండ్ లోనే 2 మిలియన్ డాలర్స్ ని కూడా క్రాస్ చేసిన గుంటూరు కారం సినిమా ఇప్పుడు 2.5 మిలియన్ డాలర్స్ ని రీచ్ అయ్యింది. భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాల తర్వాత మహేష్ నుంచి వచ్చిన 2.5 మిలియన్ డాలర్స్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమాతో నార్త్ అమెరికాలో మూడు 2.5 మిలియన్ డాలర్స్ సినిమాలు ఉన్న ఏకైక తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు.
ఇంత కన్సిస్టెంట్ గా కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు కాబట్టే మహేష్ కి ఓవర్సీస్ అడ్డా అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే భరత్ అనే నేను సినిమా నార్త్ అమెరికాలో మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని ఇచ్చింది. 3.41 మిలియన్ డాలర్స్ తో భరత్ అనే నేను ఉండగా… గుంటూరు కారం సినిమా క్లోజింగ్ టైమ్ కి 3 మిలియన్ డాలర్స్ వరకు అయినా వచ్చి ఆగుతుందేమో చూడాలి. వీకెండ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది కాబట్టి గుంటూరు కారం సినిమా బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తే 3 మిలియన్ డాలర్స్ టార్గెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు కానీ హనుమాన్ మూవీ గుంటూరు కారం బుకింగ్స్ కి బ్రేకులు వేస్తోంది. 3 మిలియన్ మార్క్ ని రీచ్ అవ్వాలి అంటే గుంటూరు కారం సినిమా హనుమాన్ ని తట్టుకోని నిలబడాల్సి ఉంది.