Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే భారీగా యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అయితే ఆమెకు తాజాగా ఫేక్ అకౌంట్ల కష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు సితారకు కూడా ఇలాంటివే ఎదురవుతున్నాయి. తాజాగా సితార ఈ ఫేక్ అకౌంట్ల గురించి ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. తన పేరుతో కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయినట్టు తనకు తెలిసిందని చెప్పింది.
Read Also : Prabhas : రూ.50కోట్లు ఇచ్చిన ప్రభాస్.. ఎవరికో తెలుసా..?
ఆ ఫేక్ అకౌంట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు కేవలం ఇన్ స్టాలో మాత్రమే అఫీషియల్ అకౌంట్ ఉంది. ఇది మాత్రమే నా అకౌంట్. ఏదైనా ఉంటే ఇందులోనే చెబుతాను. అంతే గానీ వేరే అకౌంట్లలో వచ్చే వాటిని నమ్మకండి. ఇతర సోషల్ మీడియా యాప్స్ లో నా పేరుతో ఉన్న అకౌంట్ల నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా నమ్మొద్దు. ఆ అకౌంట్లను అన్ ఫాలో చేయండి అంటూ కోరింది సితార. చూస్తుంటే ఈ ఫేక్ అకౌంట్లతో ఆమెకు ఏవైనా ఇబ్బందులు వచ్చాయోమే.. అందుకే ఇలాంటి పోస్టు పెట్టినట్టుంది అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ఆమె పెట్టే వీడియోలు, ఫొటోలు క్షణల్లోనే వైరల్ అయిపోతుంటాయి.
Read Also : Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎవరికీ తలొంచడు.. బ్రహ్మానందం కామెంట్స్