Mahesh Babu: ఎన్నో అంచనాల మధ్య నేడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. గురూజీ డైలాగ్స్ కు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండనే ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ స్టైల్, గురూజీ డైలాగ్స్, శ్రీలీల అందం.. ఇలా మంచి మంచి హైలైట్స్ అన్ని ఉండడంతో.. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే గుంటూరు కారం అనే అనుకున్నారు. కానీ, ఇక్కడ చూస్తే టాక్ వేరేలా కనిపిస్తుంది. త్రివిక్రమ్ మార్క్ ఇసుమంతైనా కనిపించలేదని.. మహేష్ వన్ మ్యాన్ షో తప్ప కథేమీ లేదని తీసిపడేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు లేనిది.. ఇందులో సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా సాంగ్స్ స్పూఫ్స్ వాడడం, దానికి మహేష్ సైతం డ్యాన్స్ వేయడం అస్సలు నచ్చలేదని అంటున్నారు. గురూజీ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేదని చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక సీన్ లో మహేష్ బాబు లుంగీని శ్రీలీల లాగేయడం ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదని అంటున్నారు.
గోడౌన్ లో మహేష్ , వెన్నెల కిషోర్ మందుకొడుతుండగా.. శ్రీలీల వస్తుంది. అక్కడ మహేష్ తాగి.. వెన్నెల కిషోర్ ను పాట పాడమని అడగడం, అతను చెప్పవే చిరుగాలి సాంగ్ పాడడంతో మహేష్.. భూమికను గుర్తుచేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్లు చాలా కండపట్టి ఉంటారని చెప్పుకొస్తాడు. ఈకాలం అమ్మాయిలు అస్సలు కొద్దిగా కండ కూడా ఉండరని, వాళ్లకు డ్యాన్స్, సాంగ్స్, అసలు తెలుగు మాట్లాడమే రాదు అని చెప్పగానే.. వోడ్కా తాగిన శ్రీలీల.. చెప్పవే చిరుగాలి సాంగ్ కు డ్యాన్స్ వేస్తుంది. ఆ తరువాత ట్రెండింగ్ సాంగ్ అయిన నక్లెస్ గొలుసు సాంగ్ కు డ్యాన్స్ వేస్తూ మహేష్ ను కూడా డ్యాన్స్ వేయడానికి లాగుతుంది. ఇక శ్రీలీలతో స్టెప్స్ వేస్తుండగా.. ఆమె చివరిలో మహేష్ లుంగీ లాగేస్తుంది. ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ అంతా ఎంజాయ్ గా ఉన్నా కూడా మహేష్ లుంగీని హీరోయిన్ లాగడం.. ఇదివరకు ఎప్పుడు చూడలేదని, ఇది అస్సలు బాగోలేదని మహేష్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.