Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. కానీ, బాబుకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. ప్రస్తుతం మహేష్ ఏజ్ 48.అయితే .. మహేష్ ను చూసిన వారెవ్వరు కూడా అది ఒప్పుకోరు. చివరికి ఫారిన్ కంట్రీలో కూడా మహేష్ ఏజ్ 48 అంటే ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక యూట్యూబర్.. మహేష్ ఫోటో చూపించి ఫారిన్ కంట్రీ అమ్మాయిలను అడగ్గా.. అందరూ అతనికి 25, 27 అని చెప్పుకొచ్చారు. అది మహేష్ అందం అంటే. అలా మెయింటైన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక నిత్యం నమ్రత.. మహేష్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
ఇక తాజాగా నమ్రత.. మహేష్ లేటెస్ట్ ఫోటోను షేర్ చేసింది. అసలు ఈ ఫోటోలో అయితే.. మహేష్ ఒక టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఎప్పుడు మహేష్ తన కొడుకు గౌతమ్ తో కనిపించినా కూడా ఇద్దరు తండ్రికొడుకుల్లా కాకుండా అన్నదమ్ముల్లా కనిపిస్తారు. ఈ ఫొటోలో మహేష్.. వైట్ స్వేట్టర్, బ్లాక్ గాగుల్స్, పర్ఫెక్ట్ జా లైన్ తో అదిరిపోయాడు. అసలు మహేష్ ను ఇలా చూస్తే.. పెళ్లికానీ కుర్రాడు అనుకుంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారే.. వాళ్లకే తమ్ముడిలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే రేపు మహేష్ నటించిన గుంటూరు కారం రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.