Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. తన ముందు సినిమాల లానే తల్లి కోసం కొడుకు ఏం చేశాడు అనేది గుంటూరు కారం కథ. దీనికి అభిమానులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ట్విట్టర్ లో అజ్ఞాతవాసిని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
త్రివిక్రమ్ కెరీర్ లో పవన్ కళ్యాణ్ కు అంత భారీ పరాజయాన్ని అందజేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అజ్ఞాతవాసి మాత్రమే. ఈ సినిమాపై అప్పుడు అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకున్నారో అందరికి తెల్సిందే. అత్తారింటికి దారేది లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా అంటే.. చొక్కాలు చింపేసుకొని మరీ అభిమానులు థియేటర్ కు వెళ్లారు.. కానీ, తలలు పట్టుకొని బయటికి వచ్చారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం పరిస్థితి కూడా అదే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. అయితే ఆరేళ్ల క్రితం రిలీజైన పవన్ సినిమా క్రియేట్ చేసిన ఓవర్‌సీస్ కలెక్షన్స్ రికార్డును గుంటూరు కారం క్రాస్ చేయలేదని, ఈ రెండు సినిమాలు ఒకటే అని ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతవాసి ట్రెండింగ్ లో ఉంది. మరి గుంటూరు కారం ఎలాంటి కలక్షన్స్ అందుకుంటుందో చూడాలి.