‘సర్కారు వారి పాట’తో ఘనవిజయం సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలోనే ముగియగా.. జులై రెండో వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై క్రేజీ వార్తలు ఒక్కొక్కటిగా తెరమీదకొస్తున్నాయి.
లేటెస్ట్‌గా ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇదో పీరియాడిక్ డ్రామా అని.. ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్ ఎపిసోడ్స్ సమానంగా సాగుతాయని టాక్ వినిపిస్తోంది. ఇలా ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక రోల్‌లో, ప్రెజెంట్ స్టోరీలో మరో పాత్రలో మహేశ్ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మహేశ్ తన కెరీర్‌లో తొలిసారి డ్యుయెల్ రోల్ చేసినట్టు అవుతుంది. అలాగే ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అందడం ఖాయం!
కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను ఓ ఫైట్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేస్తారని, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో ఇది షూట్ చేయనున్నారని తెలిసింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. మీనాక్షీ చౌదరిని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి.