‘సర్కారు వారి పాట’తో ఘనవిజయం సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలోనే ముగియగా.. జులై రెండో వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై క్రేజీ వార్తలు ఒక్కొక్కటిగా తెరమీదకొస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇదో పీరియాడిక్ డ్రామా…