ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఘట్టమనేని ఫాన్స్ అంతా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మహేష్ ఫాన్స్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తున్నారు. మహేష్ ఫాన్స్ హ్యాపీనెస్ ని మరింత పెంచుతోంది ‘బిజినెస్ మాన్’ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ ఒకటి. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్ ఇంటెన్స్ గా ఉంటుంది. ‘సూర్య భాయ్’ ఒక డ్రగ్ లా మూవీ లవర్స్ ని మాయ చేసాడు. పదమూడేళ్ల క్రితం రిలీజ్ అయినా ఇప్పటికే ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూనే ఉంది బిజినెస్ మాన్ సినిమా.
కేవలం మహేశ్ బాబు ఫాన్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ గా ప్రతి ఒక్కరికీ నచ్చిన ఈ మూవీ నిజంగానే ఒక సెన్సేషన్. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఫుల్ జోష్ లో సాగుతుంది కాబట్టి బిజినెస్ మన్ సినిమా రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ చెయ్యనున్నారు. ఆగస్టు 9 దగ్గర పడుతూ ఉండడంతో మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసారు. బిజినెస్ మాన్ సినిమాలోని “దస్ దిన్ కే బాద్ ఇదిరీ మిలేంగే” డైలాగ్ చెప్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా రీరిలీజ్ అంటే ఆ హీరో ఫాన్స్ మాత్రమే వెళ్తారు కానీ బిజినెస్ మాన్ సినిమా చూడడానికి మాత్రం ప్రతి హీరో ఫాన్స్ వెళ్తారు. సో కచ్చితంగా బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ. మరి ఈ సినిమాకి వచ్చే రీచ్ ని చూసైనా మహేష్ అండ్ పూరి మళ్లీ సినిమా చేస్తారేమో చూడాలి.