Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. జనవరి 6 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నారు. కానీ, సెక్యూరిటీ రీజన్స్ వలన ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఈరోజు ఈ ఈవెంట్ గుంటూరులో జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు చిత్ర బృందం మొత్తం హాజరు అవుతుంది.
తాజాగా మహేష్ బాబు గుంటూరు లో ల్యాండ్ అయ్యాడు. స్పెషల్ ఫ్లైట్ లో మహేష్, త్రివిక్రమ్, హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షీ.. థమన్, నాగవంశీ, చినబాబు, దిల్ రాజు గుంటూరుకు చేరుకున్నారు. ఇక గుంటూరు లో ఈవెంట్ అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. బాబులకే బాబు మహేష్ బాబు అనే నినాదాలతో ఈవెంట్ దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ఈవెంట్ లో బాబు ఎలాంటి స్పీచ్ తో అదరగొడతాడో చూడాలి.