Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా మహేష్ కు కుటుంబం అంటే ఎంత పిచ్చినో అందరికి తెలుసు. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీ.. ఇవి తప్ప మహేష్ కు వేరే ప్రపంచం లేదు. ఏడాదిలో షూటింగ్ లేకుండా అయినా కూడా ఉంటాడు కానీ, కుటుంబంతోకలిసి వెకేషన్ కు వెళ్లకుండా ఉండలేడు. ముఖ్యంగా కూతురు సితారతో మహేష్ అనుబంధం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నిత్యం మహేష్, సితార కలిసి ఉన్న ఫోటోలు.. మెమొరీబుల్ మూమెంట్స్ ను నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా మహేష్ బాబు.. సీతూ పాప కలిసి ఉన్న ఒక అడోరబుల్ పిక్ ను షేర్ చేశాడు. ఉదయం లేచిన వెంటనే సీతూ పాపను గట్టిగా కౌగిలించుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. మాయా కౌగిలి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ఫోటో చూస్తే ఎంతో ముద్దుగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో నటించనున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రెండు సినిమాలతో సూపర్ స్టార్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.