Tollywood Rewind 2023: ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించని తెలుగు హీరోలు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ టాప్ నలుగురు హీరోలు 2023 సంవత్సరాన్ని పూర్తిగా వేస్ట్ చేసుకున్నారు.
మహేష్ బాబు- గుంటూరు కారం 2023 నుంచి 2024కి మారింది
ఈ ఏడాది ఆగస్ట్‌లో “గుంటూరు కారం” విడుదల చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేశారు. అయితే అనేక కారణాలతో సినిమా ప్రొడక్షన్ రెండుసార్లు వాయిదా పడింది. విడుదల తేదీని జనవరి 12, 2024కి వెనక్కి మార్చడంతో మహేష్ బాబు 2023 సంవత్సరాన్ని మిస్ అయ్యారు.
Also Read
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
RRR స్టార్ల షూటింగ్‌లు ఆలస్యం అయ్యాయి
“RRR” సినిమాతో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్కార్ ప్రచారంలో పాల్గొన్నారు. దెబ్బతో వారి షూట్ ప్లానింగ్స్ అన్నీ వెనక్కి నెట్టబడ్డాయి. ఎన్టీఆర్ “దేవర” ప్రస్తుతం నిర్మాణంలో ఉంది , ఏప్రిల్ 2024 లో థియేటర్లలో విడుదల అవుతుంది. మరోవైపు శంకర్ గత రెండు సంవత్సరాలుగా “గేమ్ ఛేంజర్” సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల పాటు చిత్రీకరణ జరగనుంది. ఫలితంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2024 ద్వితీయార్థంలో విడుదల కానుంది.
Tollywood Heros : బుల్లితెరపై కూడా హవాను కొనసాగిస్తున్న స్టార్ హీరోలు..
అల్లు అర్జున్ కూడా ఈ సంవత్సరం మిస్ అయ్యాడు
అల్లు అర్జున్ -దర్శకుడు సుకుమార్ “పుష్ప 2” ను 2023లో విడుదల చేయాలనే తమ ప్రణాళికలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి భాగం భారతదేశంలో భారీ విజయాన్ని సాధించగా సీక్వెల్ ఇంకా పెద్దదిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఫలితంగా, విడుదల తేదీ ఆగష్టు 2024కి వాయిదా పడింది. అందుకే, అల్లు అర్జున్‌కి ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ కూడా లేదు.
శర్వానంద్
శర్వానంద్, నాగార్జున అక్కినేని, వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి వంటి ఇతర హీరోలు కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు. శర్వానంద్ గత సంవత్సరం “ఒకే ఒక జీవితం”తో విజయాన్ని అందుకున్నాడు, ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ సినిమాని ప్రారంభించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇవన్నీ 2023లో ఆయన సినిమా విడుదల కాకపోవడానికి కారణమయ్యాయి.
వెంకటేష్
వెంకటేష్ ఈ సంవత్సరం తన మొదటి వెబ్ సిరీస్ “రానా నాయుడు”లో కనిపించినప్పటికీ, 2023లో ఆయన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన “సైంధవ్” జనవరి 13, 2024కి వాయిదా పడింది. ఇక ఆయన మేనల్లుడు రానా కూడా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.
నాగార్జున
వరుస ఫ్లాపుల తర్వాత, నాగార్జున మూడు నెలల క్రితం “నా సామి రంగ” సినిమా ప్రారంభించడానికి చాలా బ్రేక్ తీసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో “బిగ్ బాస్ తెలుగు” హోస్ట్‌గా అయితే కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?