Jamal Kudu : యానిమల్ మూవీ పాపులర్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..యానిమల్ మూవీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పార్శీ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియోను నేడు (డిసెంబర్ 13) మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా లో అబ్రార్ అనే విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ పాట వస్తుంది. ఈ భాష ఎవరికీ తెలియకపోయినా కూడా మ్యూజిక్ మాత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.దీంతో ‘జమాల్ కుదు’ సాంగ్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఎంతో మంది ఈ సాంగ్ పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు. దీంతో యానిమల్ మూవీ మేకర్స్ ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో టీ-సిరీస్ ఈ వీడియో రిలీజ్ చేసిన గంట లోనే మిలియన్ వ్యూస్ వరకూ రావడం గమనార్హం.
బాబీ డియోల్ అబ్రార్ పాత్ర తల పై మందు గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది.తన మూడో పెళ్లి సందడిలో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో సింగర్స్ ఈ పార్శీ సాంగ్ పాడుతుంటే.. అబ్రార్ ఎంతో ఖుషీ గా కనిపిస్తాడు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హర్షవర్దన్ రామేశ్వర్.. ఈ పాపులర్ ఇరానియన్ బండారీ మ్యూజిక్ ను ఇంకాస్త కొత్తగా వినిపించడానికి ప్రయత్నించాడు. ఎంతో కొత్తగా అనిపించే ఈ పాటను భాష అర్థం కాకపోయినా ఎంతో మంది ఇండియన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.. ఈ ట్యూన్స్ కి తగ్గ స్టెప్పులు కూడా వేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు వారిని మరింత అలరించడానికి ఫుల్ వీడియో వచ్చేసింది. ఇదిలా ఉంటే యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తం గా 12 రోజుల్లో రూ.757 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..