మాధురీ దీక్షిత్ ని రకరకాల టైటిల్స్ తో ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు! అయితే, ‘ధక్ ధక్ గాళ్’ అని అప్పట్లో చాలా మంది పిలిచేవారు! ఇప్పుడైతే మాధురీ యంగ్ గాళ్ కాకపోవచ్చుగానీ… ‘ధక్ ధక్ సుందరి’ అని మాత్రం… మనం ఇప్పటికీ పిలుచుకోవచ్చు! ఆమె అందం, ఆకర్షణ ఇప్పటికీ చెక్కుచెదరలేని తన డై హార్డ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు…మాధురీ కెరీర్ లోనే ఆల్ టైం రొమాంటిక్ హిట్ గా నిలిచిన ‘ధక్ ధక్ కరేనా లగా’ పాట … అది పాడిన సింగర్స్ అనూరాధ పౌడ్వాల్, కుమార్ సాను కెరీర్స్ లో కూడా స్పెషల్ గా నిలిచిపోయింది. వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా ఆ పాట మార్మోగకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా కార్యక్రమం పూర్తి కాదు. అదే జరిగింది లెటెస్ట్ ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ లోనూ! కుమార్ సాను, అనూరాధ పౌడ్వాల్ అతిథులుగా పాల్గొన్న ఎపిసోడ్ తాలూకూ ప్రోమో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది!
లెటెస్ట్ ఇండియన్ ఐడల్ ప్రొమోలో అనూరాధ పౌడ్వాల్ ‘ధక్ ధక్’ సాంగ్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ వివరించింది. సాంగ్ మొదట్లో వచ్చే ‘ఔచ్!’ అన్న సెక్సీ పదం సంగీత దర్శకుడు కోరగా సింగర్ యాడ్ చేసిందట. నిజానికి సంగీత దర్శకుడు మరేదో పదం చెప్పినప్పటికీ అనూరాధ ‘ఔచ్!’ అనే శబ్దం తనంత తానుగా పాటకి జత చేసిందట. కానీ, తరువాతి కాలంలో అదే మాధురీకి పర్మనెంట్ ట్రేడ్ మార్క్ సౌండ్ గా నిలిచిపోయింది. అంతలా ఆ పదాన్ని తెర మీద నుంచీ ప్రేక్షకుల గుండెల్లోకి ప్రయోగించింది గార్జియస్ గాడెస్ మాధురీ! అందుకే, ఆమెకి థాంక్స్ అంటోంది యాక్చువల్ గా ‘ఔచ్!’ అంటూ గమ్మత్తుగా మత్తుని ఒలికించిన అనూరాధ పౌడ్వాల్!