కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ అందరికీ… హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, జోష్, సై లాంటి సినిమాలు గుర్తొస్తాయి. స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఫన్, స్టూడెంట్స్ చేసే అల్లరిని చూపిస్తూ ఆడియన్స్ ఈ సినిమాలు విపరీతంగా ఎంటర్టైన్ చేసాయి. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ లోటుని తీరుస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మ్యాడ్నెస్ ని పెట్టుకోని ‘మ్యాడ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ లు హీరోలుగా నటిస్తుండగా… గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లందరూ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేసిన అల్లరే ‘మ్యాడ్’ సినిమా కథ.
దాదాపు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకూ అన్ లిమిటెడ్ ఫన్ ని ఇవ్వడంలో మ్యాడ్ టీజర్ సక్సస్ అయ్యింది. టీజర్ కి భీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. హీరోలు చేసిన అల్లరి టీజర్ లో మాములుగా లేదు. కంప్లీట్ రోలర్ క్యాస్టర్ రైడ్ లా ఉన్న ఈ మూవీ టీజర్ యూత్ ని అట్రాక్ట్ చేయడం గ్యారెంటీ. శనివారం, ఆదివారం ఎలాగూ సెలవలే కాబట్టి యూత్ థియేటర్స్ కి వస్తారు, అలాంటి వాళ్లని మండే కూడా కాలేజ్ మాన్పించేలా చేస్తే చాలు సినిమా హిట్ కొట్టినట్లే. ఈ విషయంలో మ్యాడ్ చిత్ర యూనిట్ టీజర్ తో బజ్ ని జనరేట్ చేసింది. ఇకపై సోషల్ మీడియాలో మ్యాడ్ డైలాగ్స్ ట్రెండ్ అవ్వడం, యూత్ ఈ డైలాగ్స్ ని విపరీతంగా వాడడం గ్యారెంటీ. టీజర్ లో ఇంకా స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంది… టీజర్ ని కాస్త స్లో చేసి చూస్తే జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ అనుదీప్ కేవీ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తాడు. అనుదీప్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ బాగా తెలుసు… సో మ్యాడ్ మూవీ అనుదీప్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తే మాత్రం సినిమా నిజంగానే ఆడియన్స్ కి మ్యాడ్ హ్యాపినెస్ ఇచ్చేస్తది.
Unleash the world of MADness 🔥 #MADTeaser
Get ready to embrace the madness like never before! An adrenaline-fueled and fun-filled ride awaits you all! 🥳💥
Here’s the teaser of #MADtheMovie 🔗 : https://t.co/3HSJzNNMVF#MAD @kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara… pic.twitter.com/ClQhtWVrIe
— Sithara Entertainments (@SitharaEnts) August 31, 2023