Lyricist Kandikonda Passes Away News.
ప్రముఖ గీత రచయిత కందికొండ గత కొంతకాలంగా నోటి కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గీత రచయిత కందికొండ పూర్తి పేరు యాదగిరి. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఆర్థికంగా సతమతమయ్యారు. ఆ సమయంలో తోటి గీత రచయితలతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పూనుకుని కందికొండ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కందికొండ రాసిన పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన మరణం తెలుగు సినిమాకే కాకుండా తెలంగాణ సంస్కృతికి తీరని లోటు అని పలువురు సంతాపం తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు కందికొండ పాటలు రాశారు. అలానే తెలంగాణ గీత రచయితల మీద సాంస్కృతిక శాఖ తెలుగు మహాసభల సమయంలో వెలువరిచిన పుస్తకానికి కూడా ఆయనే రచన చేశారు.