Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lust Stories 3: ఓటీటీ ప్రపంచంలో బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ప్రాంఛైజీ ‘లస్ట్ స్టోరీస్’. మానవ సంబంధాల్లోని కామం, దాగివున్న లైంగిక కోరికలు, వివాహేతర బంధాలు చుట్టూ తిరిగే ఈ ఆంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సాంప్రదాయ చట్రంలో ఇప్పటికీ ‘కామం’, శారీరక ఆకర్షణ అనే విషయాలు నాలుగు గోడల మధ్య దాచే రహస్యాలు. కానీ ఈ సిరీస్ మాత్రం ఆ నిషిద్ధ సరిహద్దులను బద్దలు కొడుతూ, స్త్రీ-పురుషుల మధ్య ఉన్న అత్యంత వ్యక్తిగత కోరికలు, పడకగది రహస్యాలను ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్‌గా ఆవిష్కరించడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటోంది.
గత రెండు సీజన్లలో స్వయం తృప్తి, వివాహేతర సంబంధాల వంటి సున్నిత అంశాలను బహిరంగంగా చర్చించి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజా పోస్టర్లో కూడా అదితి రావు హైదరీ, అలీ ఫజల్, సిద్ధార్థ్ వంటి తారలు శృంగారభరిత భంగిమల్లో కనిపిస్తూ, ఈసారి హద్దులు మరింత దాటబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. ఈ ఆంథాలజీలోని నాలుగు భిన్నమైన కథలను విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. రొన్నీ స్క్రూవాలా, ఆశి దువా సారా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. నటీనటుల విషయానికొస్తే రాధికా ఆప్టే, అదితి రావు హైదరీ, అలీ ఫజల్, సిద్ధార్థ్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ఈ ‘A’ రేటెడ్ సిరీస్ భారతీయ ఓటీటీ ఆడియన్స్‌లో ఇంకెన్ని కొత్త చర్చలకు, వివాదాలకు తెరతీస్తుందో వేచి చూడాలి.
Also Read
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
- Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
తాజావార్తలు
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!