Lust Stories 2: నెట్ ఫ్లిక్స్.. ప్రస్తుతం డిజిటల్ రంగంలో నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఓటిటీ ప్లాట్ ఫార్మ్. భాషతో సంబంధం లేకుండా అభిమనులకు కేవలం వినోదాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే నెట్ ఫ్లిక్స్ మాత్రమే అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే చాలా సిరీస్ లో ఎక్కువగా సెక్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే రానా నాయుడు లాంటి సిరీస్ తో విమర్శలు అందుకున్న నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు అంతకుమించిన సిరీస్ తో రానుంది. అదే లస్ట్ స్టోరీస్ 2. 2018 లో మొదటి సీజన్ ను రిలీజ్ చేశారు. నలుగురు హీరోయిన్లు.. నలుగురు దర్శకులు.. నాలుగు కథలు.. అన్నింటిలో కామన్ సెక్స్. ఇక ఇదే లైన్ తో ఈసారి రెండో సీజన్ కు రెడీ అయిపోయారు. అప్పట్లో ఓటిటీ అంటే చాలా తక్కువమందికి తెలుసు కాబట్టి అది అంత ఫేమస్ కాలేదు. కానీ, ఇప్పుడు ఓటిటీనే నెంబర్ 1 గా ఉంది. దీంతో లస్ట్ స్టోరీస్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈసారి స్టార్ క్యాస్టింగ్ తో మేకర్స్ అదరగొట్టేశారు. అందరూ స్టార్ హీరోయిన్లు.. అందులోను అందాల ఆరబోత, కిస్సింగ్ సీన్స్.. ఘాటు బూతులతో నింపేశారు.
VS11: దాస్ గాడి గర్ల్ ఫ్రెండ్ రత్నమాల అదిరింది
మొదటి సీజన్ లో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనిషా కొయిరాలా, విక్కీ కౌశల్, రణదీప్ ఝా మెయిన్ కనిపించగా .. రెండో సీజన్ లో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ లు నటిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు లస్ట్ స్టోరీస్ 2ని డైరెక్ట్ చేశారు. అసలు ఈ ముద్దుగుమ్మలు అందరు ఒక్కచోట కనిపిస్తేనే ఆగని కుర్రాళ్ళు.. ఈ సిరీస్ లో వీరు చేసే విన్యాసాలకు చొక్కాలు చింపుకోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజోల్, మృణాల్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమన్నా.. ప్రియుడు విజయ్ వర్మతో ఈసారి జతకట్టనుంది. ఘాటు ముద్దులను టీజర్ లో శాంపిల్ చూపించారు కూడా. ఇక ఈ సిరీస్ జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసారి ఈ సిరీస్ ఏ రేంజ్ లో హైప్ తెస్తుందో చూడాలి.