VS11: దాస్ కా ధమ్కీ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. మరో సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కలక్షన్స్ కొద్దికొద్దిగా తగ్గి.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత విశ్వక్ సేన్.. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో vs11 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. గీత రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన అంజలి నటిస్తోంది. ఇప్పటికే నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా తెలుగోడి ఆత్మ గౌరవం అంటూ విశ్వక్ మాస్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లుంగీ, నోట్లో బీడీ, చొక్కా మడతపెడుతూ విశ్వక్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇక తాజాగా నేడు అంజలి పుట్టినరోజు కావడంతో ఆమె పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ చిత్రంలో అంజలి.. రత్నమాలగా కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. చీరకట్టుతో ఇంటిబయట కూర్చొని జుట్టును ముడివేస్తూ.. సీరియస్ లుక్ లో కనిపించింది.
Suman : ఆ సమయంలో నాకు ఆ భగవంతుడు అండగా నిలబడ్డాడు
ఇక ఈ లుక్ చూస్తుంటే.. అంజలి పవర్ ఫుల్ పాత్రలోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్, అంజలి పోస్టర్స్ ను బట్టి ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని చెప్పొచ్చు. గతకొన్నేళ్ళుగా అంజలికి మంచి హిట్ పడింది లేదు. అయితే ఓటిటీ లో మాత్రం అమ్మడు వరుస సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇంకోపక్క శంకర్- చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలపైనే అమ్మడి ఆశలన్నీ పెట్టుకుంది. ఇవి కనుక హిట్ టాక్ తెచ్చుకున్నాయి అంటే.. ఇంకొన్నేళ్లు ఈ చిన్నది స్టార్ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అభిమానులు అంటున్నారు. మరి అమ్మడి లక్ ఎలా ఉంటుందో చూడాలి.
మా సహజనటి అంజలి కి పుట్టినరోజు శుభాకాంక్షలు! 🤩
Introducing @yoursanjali as RATHNAMALA 💥 from #VS11 🔥#HBDAnjali ✨@VishwakSenActor @thisisysr #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/eLxPT2oBOt
— Sithara Entertainments (@SitharaEnts) June 16, 2023