హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకుంటూ ఉన్న సహజ అందాన్ని కోల్పోతూ ఉంటారు.ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా అస్సలు పట్టించుకోరు. అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ చాలా వికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. నిధి అగర్వాల్ కూడా ఒక పార్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీకి హాట్ బ్యూటీ అయిన నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పవచ్చు.. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె నటించింది. పైగా డాన్సర్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది.
తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో కూడా నటించగా ఈ సినిమాలు అంతగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు మంచి బ్రేక్ కూడా వచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడానికి బాగా గ్లామర్ షో కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోతో ఆమె బాగా రచ్చ చేస్తుంది. మొదట్లో కొంతవరకు గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత డోస్ పెంచి తెగ రచ్చ చేస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తను తన కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.. అందులో తన పెదాలు కాస్త లావుగా ఉబ్బినట్లు అయితే అనిపించాయి. దీంతో ఆ ఫోటోలు చూసి నెటిజన్స్.. పెదాలకు సర్జరీ చేయించుకుంది అంటూ కామెంట్స్ తో తెగ రచ్చ చేస్తున్నారు. ఉన్న అందాన్ని కాపాడుకోకా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటం అవసరమా అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయం గురించి నిధి ఎలాగ స్పందిస్తుందో చూడాలి.