Nagachaithanya : నాగచైతన్య ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. తండేల్ తో భారీ హిట్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం కార్తీక్ దండుతో పెద్ద సినిమానే చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం వరుసగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే శోభిత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెబుతున్న నాగచైతన్య.. ప్రస్తుతం మరోసారి ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నేను ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు చేయడం తగ్గించేశా. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. రెగ్యులర్ లవ్ స్టోరీలు కాకుండా వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Read Also : Chiranjeevi: ఫుల్ జోష్‌లో ధూసుకుపోతున్న చిరంజీవి.. MSG షూటింగ్ అప్‌డేట్!
నేను కూడా అలాంటి వాటిలోకి వెళ్లాలని శోభిత చెప్పింది. ఆమె సలహాలు బాగుంటాయి. ఒక ప్రేక్షకురాలిగా సినిమాను చూసి ఎలా ఉండాలో జెన్యూన్ గా చెబుతుంది. బాగా లేకపోతే ముఖం మీదే చెప్పేస్తుంది. అందుకే ఆమె సలహాలు ఎక్కువగా వింటాను. సోషల్ మీడియాలో నడిచే ట్రెండ్ ను ఆమె ఎక్కువగా ఫాలో అయి నాకు చెబుతూ ఉంటుంది. నా సినిమాల విషయంలో అదే నాకు బెస్ట్ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అయితే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాగచైతన్య.. శోభిత మాట వినడం అంటే కాస్త విడ్డూరంగానే ఉందంటున్నారు ఆయన అభిమానులు. ఎంత పెద్ద హీరో అయినా భార్య మాట వినాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
Read Also : CM Revanth Reddy: ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..