London Mayor Candidate Tarun Ghulati Meets Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ ను పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ కోరడం హాట్ టాపిక్ అయింది. లండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. మే 2, 2024 న లండన్ మేయర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ పదవికి 63 ఏళ్ల తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. తరుణ్ గులాటీ మూలాలు ఢిల్లీలో ఉన్నా కొన్ని దశాబ్దాల యూకే వెళ్లి ఆయన కుటుంబం లండన్ లో స్థిరపడింది. గులాటీ వ్యాపారవేత్త అయినా సనాతన ధర్మాన్ని పాటిస్తారు. మెరుగైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేక్రితమే యడం, పేదలకు తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం లాంటి కీలకాంశాల హామీతో తరుణ్ గులాటీ మేయర్ రేసులో ముందంజలో ఉన్నారు.
Pushpa Srivalli Song: డిప్యూటీ సీఎం నోట ‘శ్రీవల్లి’ పాట
తాజాగా ఆయన హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు భారీ సంఖ్యలులో ఉన్నారని ఈ సందర్భంగా పవన్ దృష్టికి తీసుకువెళ్లగా తరుణ్ గులాటీ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ సైతం స్వాగతించారు. భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకం అని తన అభిమానులు, జనసేన శ్రేణులు మాత్రమే కాకుండా తెలుగు వారు, భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు. అంతేకాక తనను కలసిన గులాటీకి పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.