DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC OTT Release: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డీసీ’ (DC) ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 2026ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT), ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ మూవీని వచ్చే 2026 సెప్టెంబర్ 4 నుండి డిజిటల్ వేదికలపై స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బి కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఒకేసారి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా హిట్ లో ప్రధాన పాత్ర పోషించింది.
‘కూలీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ కు ‘డీసీ’ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటివరకు కెమెరా వెనుక ఉండి యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన ఆయన, ఈసారి కెమెరా ముందు ప్రధాన పాత్రలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అరుణ్ మాతేశ్వరన్ తనదైన రఫ్, ఇంటెన్స్ టేకింగ్‌తో సినిమాను తెరకెక్కించగా, లోకేష్ పాత్ర కూడా అదే తరహా మాస్ ఇమేజ్ను ప్రతిబింబించేలా ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఓటీటీలోకి సినిమా రానున్న నేపథ్యంలో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు కూడా దీనిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ అభిమానులకు ‘డీసీ’లో ఆయన నటన ఎలా ఉందో ఇంట్లోనే చూసే అవకాశం లభించనుంది. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ అవుతుందనే వార్త నిజమైతే, థియేట్రికల్ రిలీజ్‌కు సుమారు నెల రోజులకే ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4 ఓటీటీ రిలీజ్ తేదీగా ప్రచారంలో ఉంది. సన్ NXTతో పాటు ప్రైమ్ వీడియోలోనూ సినిమా అందుబాటులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆఫీషియల్ అనౌన్స్ తరువాతే ‘డీసీ’ డిజిటల్ ప్రీమియర్‌పై స్పష్టత రానుంది.
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Tags
- cinema
- Lokesh Kanagaraj
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!