‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ‘డీసీ’ (DC) మూవీతో లీడ్ రోల్ పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామా ట్రైలర్ కేన్స్ వేదికగా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ ‘దేవదాస్’ పాత్రలో, బ్యూటిఫుల్ వామికా గబ్బి ‘చంద్ర’ పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరి పేర్ల (Devadas – Chandra) మొదటి అక్షరాలతోనే ఈ చిత్రానికి ‘DC’ అనే టైటిల్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్ ప్రకారం.. చిన్నతనంలోనే కోల్‌కతాలోని వ్యభిచార కూపంలోకి నెట్టబడిన చంద్ర అనే అమ్మాయి చుట్టూ కథ మొదలవుతుంది. ఆమె అక్కడ ఒక డాక్టర్‌ను చంపి పరారీలో ఉండగా, మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్‌ను చంపిన నేరస్థుడిగా దేవదాస్ పరిచయమవుతాడు. సమాజం దృష్టిలో క్రిమినల్స్‌గా మారిన ఈ ఇద్దరి మధ్య చిగురించిన విలక్షణమైన ప్రేమ, వీరిని పట్టుకోవడానికి పోలీసులు వేసిన వల, ఈ ప్రయాణంలో వచ్చే బాంబు పేలుళ్లు, యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ట్రైలర్ ముగింపులో సూర్యాస్తమయం వేళ ఒక కొండపై ఈ జంట నిలబడే విజువల్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
Also Read
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..