Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రవి-కెనీషా ఫ్రాన్సిస్ ఎఫైర్ వార్తలు కూడా గుప్పుమన్నాయి. మొదట్లో ఈ వార్తలను కొట్టిపారేసిన ఈ జంట ఆ తర్వాత కెనీషాతో రవి సన్నిహితంగా మెలిగారు. 2026 ఉత్సవ్‌లో భాగంగా మీన్కుళత్తి భగవతి ఆలయంలో ఆమె పాడగా.. రవి కూడా వేదికపై సందడి చేశాడు. అయితే ఆ తర్వాత ఆర్తి రవిని కించపరిచేలా కెనీషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్తి సన్నిహితురాలు, నటి కుష్బూ పరోక్షంగా కౌంటర్ ఇవ్వగా.. ఆర్తి ఆ పోస్ట్‌కు లైక్ కొట్టడం మరింత వివాదానికి దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కెనీషా ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. జయం రవితో బ్రేకప్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి, చెన్నై వీడుతున్నట్లు తెలిపింది. తాను ప్రేమతో ఈ బంధంలోకి వచ్చానని, ఇప్పుడు మౌనంగా వైదొలుగుతున్నానని పేర్కొంది. ఒక మంచి వ్యక్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తనను తాను ఎంతో నష్టపోయాకని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రపంచంలో దయకు చోటు లేదని, అందరూ గందరగోళాన్నే ఇష్టపడుతున్నారని వాపోయింది. “సినిమా ఇండస్ట్రీ, జనం, రవిని ప్రేమించేవాళ్లు, ద్వేషించేవాళ్లు, విమర్శించేవాళ్లు… ఇకపై ఆయన మీవాడు. నా నుంచి ఎలాంటి వివరణలు ఉండవు. నేను ఇక పోరాడలేను. మంచివాళ్లకు మద్దతుగా ఉండాలనే నా ఆలోచన తప్పని అర్థమైంది. ఈ ప్రపంచం అబద్ధాలు, మోసాలు, కుట్రలతో నిండిపోయింది” అని కెనీషా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
రవిని ప్రేమతో వదిలేస్తున్నానని, ఇకపై ఈ బంధం తన బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిజమైన ప్రేమ, విధేయతను ప్రపంచానికి చూపించాలనుకున్నా, ఎవరూ నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చెన్నైని వదిలివెళ్తున్నానని, సంగీతం, థెరపీ అన్నీ వదిలేశానని ప్రకటించింది. తన సోషల్ మీడియా ఖాతాలను సైతం డీయాక్టివేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామంతో కెనీషా, రవి విడిపోయారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై జయం రవి ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!