Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై గ్లోబల్ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించిన మూవీ ‘హనుమాన్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVC) నుంచి వచ్చిన ఈ తొలి సూపర్ హీరో మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. జాతీయ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఈ ఈ విజువల్ వండర్ అభిమానులకు మరో అద్భుతమైన కిక్ ఇచ్చేందుకు రెడీ అయింది. సినిమాలోని అద్భుతమైన గ్రాఫిక్స్, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్‌ను మరింతగా ఆస్వాదించేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు 3D ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ జూన్ 25, 2026న ‘హనుమాన్ 3D’ని వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
“బిగ్ స్క్రీన్‌పై ఈ ఎపిక్‌ను మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్ హీరోగా తేజ సజ్జా అద్భుతమైన నటన, ప్రశాంత్ వర్మ అసాధారణమైన టేకింగ్, గౌరహరి అందించిన గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ 3Dలో చూస్తుంటే ఆడియన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం, ముఖ్యంగా క్లైమాక్స్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ ‘హనుమాన్’.. ఇప్పుడు 3D ఫార్మాట్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!