Live Streaming of Guntur Kaaram Pre Release event at USA: ఈ ఏడాది సంక్రాంతి పండక్కి సినిమాల జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. నాగార్జున నా సామి రంగా అంటుంటే… రవితేజ ఈగల్ అంటూ దూసుకొస్తున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ సైంధవ్ అంటూ రాగా… కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ అంటూ సూపర్ పవర్స్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. వీరందరికీ పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం అంటూ హీటెక్కించేందుకు వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఏ సినిమాకు లేని హైప్స్ అయితే ఉన్నాయి. త్రివిక్రమ్ మహేశ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
Hanuman : హృతిక్ రోషన్ సినిమా తరహాలోనే హనుమాన్… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
మొదట ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ.. సాంగ్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తుండగా… తమన్ సంగీతం సమకూర్చాడు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న థియేటర్లోకి రానుండగా.. ఇక ఈ సినిమా మరో రికార్డు క్రియెట్ చేయబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును త్వరలో జరుపుకోనుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూఎస్ లో లైవ్ స్ట్రీమింగ్ లో ఇవ్వబోతున్నారట మేకర్స్. ఈ విషయం చెబుతూ… ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలాంటి రికార్డు లేదు. ఇప్పుడు మహేష్ బాబు కొత్త రికార్డుకు నాంది పలుకుతున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న గుంటురు కారం సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి.