Hanuman movie in the lines of krish movie: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీగా దిగుతున్న సినిమా హనుమాన్. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు పోటీగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నారు. ఈ సినిమాపై హీరో, దర్శక నిర్మాతలు తమదైన శైలిలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై హైప్ ను పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను బయటపెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Tollywood Couple: రెండో పెళ్లికి రెడీ అవుతున్న హీరో-హీరోయిన్?
ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సినిమా తరహాలోనే ఉంటుందని చెప్పి షాకిచ్చారు. క్రిష్ సినిమా కూడా సూపర్ హీరో కథాంశంతోనే తెరకెక్కింది. ఈ సూపర్ హీరో కథాంశంతో వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 2 సినిమాలు.. బాలీవుడ్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా క్రిష్ సినిమా తరహాలోనే ఉంటుందని చెప్పుకువచ్చారు. ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తే.. ఏం జరుగుతుందనే కథాంశంతో తెరకెక్కించినట్లు తెలిపారు. ఇక్కడ హను-మాన్ లో కూడా హీరోకు పవర్స్ వస్తాయని.. ఆ తర్వాత ఏం జరిగిందనే కథతో తెరకెక్కినట్లు తెలిపారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు.