Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సాయిమార్తాండ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఈటీవీ విన్ ప్రొడక్షన్ నిర్మించింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు భారీగా టికెట్లు సేల్ అయిపోయాయి. ఎంతలా అంటే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు.
Read Also : Spirit : ప్రభాస్ స్పిరిట్ గురించి సీక్రెట్ చెప్పిన సందీప్ రెడ్డి..
ప్రీమియర్స్ తో ఈ సినిమా ఏకంగా రూ.15లక్షల వరకు గ్రాస్ ను సంపాదించింది. ఇక మొదటి రోజు రూ.2.68 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ రూ.2 కోట్లే. దీంతో మొదటి రోజు కలెక్షన్లతోనే లాభాల్లోకి వచ్చేసింది. ఇలా తొలిరోజు బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ మధ్య ఇలా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు చాలా అరుదు. ఈ ఏడాదిలో బహుషా ఈ రికార్డులోకి ఎక్కిన మూవీ ఇదే కాబోలు. బడ్జెట్ తక్కువ కావడం.. మౌత్ టాక్ బాగుండటం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కామెడీ ప్లస్ యూత్ ను ఆకట్టుకునే సీన్లు ఇందులో మెయిన్ రీజన్. వయసు పైబడిన వారికి ఈ మూవీ నచ్చకపోవచ్చు గానీ.. యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. మొత్తానికి మౌళి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. పైగా రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మౌళికి భారీగా ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా సోమవారం వరకు భారీగా కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Avantika Mohan : నీకు భార్యలా కాదు.. తల్లిలా కనిపిస్తా.. హీరోయిన్ రిప్లై