Avantika Mohan : హీరోయిన్లు అంటే కుర్రాళ్లకు ఫేవరెట్ గానే ఉంటారు. హీరోయిన్లకు ప్రపోజల్స్ కూడా బోలెడన్ని వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా తీసుకోవాలనేది వారి ఇష్టం. తాజాగా ఓ హీరోయిన్ తన వెంట పడుతున్న 17 ఏళ్ల కుర్రాడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ అవంతిక మోహన్. ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఏడాది కాలంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని రోజూ మెసేజ్ లు పెడుతున్నాడంట. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. నా వెంట పడుతున్న ఓ చిన్న అభిమానికి నేను ఓ విషయం చెప్పదలచుకున్నా. ఏడాది కాలంగా నిన్ను పెళ్లి చేసుకోమని నాకు మెసేజ్ లు పెడుతున్నావ్. నువ్వు చాలా చిన్నవాడివి. చదువకునే ఏజ్ లో ఉన్నావ్.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్
నేను నీ కంటే చాలా పెద్దదాన్ని. నువ్వు బుద్ధిగా చదువుకుని పైకి ఎదగాలి. అంతే గానీ నా వెంట పడటం కరెక్ట్ కాదు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు భార్యలా కాదు.. తల్లిలా కనిపిస్తా. కాబట్టి ఇలాంటివి మానేసి బుద్ధిగా చదువుకో అంటూ సజెస్ట్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు ఇలాంటి పెళ్లి ప్రపోజల్స్ చాలా కామన్ గానే సోషల్ మీడియాలో తరచూ వస్తుంటాయి. కానీ వాళ్లు అవన్నీ పట్టించుకోరు. అవంతిక మాత్రం ఇలా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది ఆమె అభిమానులకు.
Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..