Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు ప్రోగ్రామ్ కు వెళ్లాడు. మనకు తెలిసిందే కదా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అవుతుందో. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో సందీప్ రెడ్డిని స్పిరిట్ సినిమా గురించి అడిగాడు జగపతి బాబు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా కోసం బీజీఎంను 70 శాతం రెడీ చేశామన్నాడు సందీప్.
Read Also : Avantika Mohan : నీకు భార్యలా కాదు.. తల్లిలా కనిపిస్తా.. హీరోయిన్ రిప్లై
నేను యానిమల్ సినిమా స్టార్ట్ చేయడానికి ముందే 80 శాతం బీజీఎం కంప్లీట్ అయిపోయింది. అది అనుకున్నట్టే బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం అలానే ప్లాన్ చేశాను. ఇప్పటికే 70 శాతం బీజీఎం కంప్లీట్ అయిపోయింది. ప్రభాస్ అన్నకు బీజీఎం సెట్ చేయడం చాలా ఈజీ. ఆయన కటౌట్ కు తగ్గట్టు సీన్లు రాయడం, బీజీఎం చేయడం పెద్ద కష్టమేమీ కాదు అన్నాడు సందీప్ రెడ్డి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. ఆ తర్వాత వరుసగా అప్డేట్లు ఇస్తామని తెలిపాడు సందీప్ రెడ్డి. దీంతో అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..