రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులు చాలా రోజులుగా ‘లైగర్’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఎట్టకేలకు ‘లైగర్’ రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించారు.
Read Also : “పుష్ప”రాజ్ కు మెగా విషెస్
‘లైగర్’ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానికి ముందు ఈ న్యూ ఇయర్ కి ఆగ్ లాగా దేంగే అంటూ డిసెంబర్ 31, 2021న ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేక ఫస్ట్ గ్లింప్స్ రాబోతోంది. విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఆమెకు సౌత్ లో ఇదే మొదటి చిత్రం. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.