Renu Desai: నేను రెండో పెళ్లి చేసుకుంటాను.. అతను నేను సుఖంగా ఉంటే చాలు అన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య. ఇక కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తుంది. ఇక పవన్ తో రేణు విడిపోయినా కూడా పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆమెనే వదినమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. ఇక దాదాపు ఆరేళ్ళ క్రితం రేణు .. రెండో పెళ్లి చేసుకోవడానికి అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఏకిపారేశారు. దీంతో ఆ పెళ్లిని రేణు క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 23 ఏళ్ల తరువాత ఆమె టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వూస్ ఇస్తున్న రేణు.. సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.
Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పేసిన పెద్దమ్మ..
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ” పవన్ నుంచి విడిపోయేటప్పుడు అకీరా, ఆద్య చిన్న పిల్లలు. కుటుంబం, స్నేహితులు అందరు నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహాలు ఇచ్చారు. నాకు తోడుగా.. పిల్లలకు అండగా ఉంటారని కన్విన్స్ చేశారు. నేను కూడా వారు చెప్పినదానికి ఓకే అన్నాను. మా కుటుంబానికి, స్నేహితులకు నచ్చిన అతనితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాను. మాది లవ్ అనుకుంటున్నారు. కాదు.. అది కేవలం అరేంజ్డ్. నా గురించి అంతా చెప్పి.. ఓకే అన్నాక మేము ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం, ఆ ఫోటోలను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు ఆద్య వయస్సు 7. ఆ సమయంలో నాకు ఒకటి అనిపించింది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే.. అతనికి టైమ్ కేటాయించాలి. అప్పుడు ఆద్య కు టైమ్ ఇవ్వలేను. అందుకే నేను అప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆద్యకు 16 వచ్చాయి. ఒక సింగిల్ పేరెంట్ గా పిల్లలకు ఒక వయస్సు వచ్చేవరకు తోడు ఉండాలనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇంకో రెండు మూడేళ్ళ తరువాత నా గురించి నేను ఆలోచనలనుకుంటున్నాను. అప్పుడు పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను. నా పిల్లలు చాలా స్వీట్.. అకీరాకు, నాకు మధ్య ఇలాంటి డిస్కషన్ వస్తుంది. నువ్వు వేరే వ్యక్తితో హ్యాపీగా, సుఖంగా ఉంటే చాలు అంటాడు. ఆద్య కూడా అదే అంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!