అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేవు, తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు, కన్నడలో థియేటర్స్ ఎక్కువ రాలేదు… తెలుగులో మాత్రమే లియో సినిమాకి క్లీన్ రిలీజ్ దొరుకుతుంది, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ కి ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి పిటీషన్ ప్రకారం లియో సినిమా విడుదలకి కోర్ట్ స్టే ఇచ్చింది. దీని వెనకున్న కారణాలని, అసలు ఏం జరిగింది అనే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి లియో తెలుగు థియేటర్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశీ మరికాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి వివరించనున్నాడు.
లియో సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి… సాలిడ్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. ఎదురుగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఉన్నా కూడా… లియో బుకింగ్స్ జోష్ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం లియో మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండడమే. లోకేష్ కనగరాజ్ క్రేజ్ లియో సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ కి హెల్ప్ అవుతుంది. ఓవరాల్ గా లియో సినిమా మొదటి రోజు వంద కోట్లు రాబడుతుంది అనే అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. ఇప్పుడు లియో తెలుగు రిలీజ్ లేకపోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కి భారీ డెంట్ పడినట్లు అయ్యింది. మరి ఈ విషయంలో అసలు ఏం జరిగింది? ఎందుకు లియో తెలుగు రిలీజ్ ని ఒక రోజు వాయిదా వేశారు? ఈ వాయిదా ఇంపాక్ట్ కలెక్షన్స్ లో ఎంతవరకూ చూపిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే అక్టోబర్ 20న రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. రవితేజని కాదని మొదటిరోజు లియో సినిమాకి ఎంతమంది తెలుగు ఆడియన్స్ వెళ్తారు అనేది చూడాలి.