Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. లియో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక గత కొన్నిరోజుల నుంచి లియోలో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ క్యామియో లో నటిస్తున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. దాన్ని టాలీవుడ్ ఏ మాత్రం అంగీకరించలేకపోతుంది. హైప్ తెచ్చుకోవడం కోసమే కొన్ని కోలీవుడ్ సోషల్ మీడియా సైట్స్ ఈ విధంగా పుకారు పుట్టించారని కొందరు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా ..మేకర్స్ మాత్రం స్పందించిందే లేదు. నిజం చెప్పాలంటే.. కోలీవుడ్ లో ఉన్నంత హైప్.. లియో కు టాలీవుడ్ లో లేదు. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక లియోను గట్టెక్కించేది కేవలం అనిరుధ్ అని అభిమానులు అంటున్నారు.
Gangs Of Godavari: లంకల రత్నతో ఆడిపాడనున్న బాహుబలి బ్యూటీ..?
విక్రమ్, జైలర్ సినిమాలతో అనిరుధ్ రేంజ్ వేరే లెవెల్ కు వెళ్ళింది. దీంతో లియో కూడా అనిరుధ్ చేతుల్లోనే పెట్టారు. కానీ, ఈరోజు రిలీజైన సాంగ్ చూస్తుంటే ఇదంతా వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అనిరుధ్ మాస్ సాంగ్స్ కన్నా మెలోడీస్ కే ఎక్కువ ఫేమస్. అతను మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి రొమాంటిక్ సాంగ్ ను కూడా చార్ట్ బస్టర్ చేయగలడు. ఇక ఈరోజు రిలీజైన ప్రేమ ఓ ఆయుధమే అనే సాంగ్ అంతగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదని అనిపిస్తుంది. విజయ్- త్రిష జోడీ బాగానే కనిపించినా మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ మిస్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమా విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.