కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కాగా, మరొకటి 70 ఏళ్ళ వృద్ధుడు పాత్ర.. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కనిపిస్తున్నాడు. ఇక ఈ పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. విలన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా రూ.4 కోట్లతో ఒక భారీ సెట్ ను నిర్మించారట మేకర్స్.. అంతేకాకుండా ఈ సెట్ లో కార్తీ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఖైదీలో సాహసాలు చేసినట్లు ఈ చిత్రంలో కూడా కార్తీ యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నాడట. ఇక ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీఖన్నా, రజీషా విజయన్ నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో కార్తీ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.