Siddu Jonnalagadda: ఒక్క హిట్ పడడంతో ‘డీజే టిల్లు’ బలుపు చూపిస్తున్నాడట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు. డీజే టిల్లు రిలీజ్ కాకముందే సిద్దు ఒక సినిమాలో కీలక పాత్రలో చేస్తునట్లు ప్రకటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కప్పెలా’ రీమేక్ లో సిద్దు నటిస్తున్నాడని వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. డీజే టిల్లు సినిమా నిర్మించిన అదే బ్యానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది.
శౌరి చంద్రశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ను కాపాడే హీరో పాత్రలో సిద్దును ఎంపిక చేశారు మేకర్స్. ఈ పాత్ర కొద్దిసేపే ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మొదట ఈ పాత్రను ఒప్పుకొని డేట్స్ ఇచ్చి.. అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసిన సిద్దు.. డీజే టిల్లు హిట్ కావడం, ఓవర్ నైట్ స్టార్ గా మారడంతో.. ఈ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ గా మారుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సిద్దు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. అయితే దర్శకుడు మాత్రం షూటింగ్ కూడా మొదలుపెట్టేశామని, అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసి ఎలా తప్పుకుంటాడని నిలదీయడంతో కంట్రోల్ తప్పిన సిద్దు అతడిపై కొద్దిగా దురుసుగా ప్రవర్తించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో పలువురు ఒక్క హిట్టు పడడంతోనే బాబు బలుపు చూపిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
తాజావార్తలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!