ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్న రామ్.. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ ను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయపాటి కోసం మొదటిసారి రామ్ సరికొత్త ప్రయోగానికి సిద్దమయ్యాడట.
రామ్ కెరీర్ లో రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. మరోసారి బోయాపాటి కోసం రామ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నాడట. ఇక ఇందులో రామ్ అన్నదమ్ములుగా డబుల్ యాక్షన్ లో కనిపిస్తాడట.. ఒకరు హీరో అయితే మరొకరు విలన్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోగా తన నటనను చూపించిన రామ్ ఇప్పుడు ఈ సినిమా కోసం విలన్ గా మారబోతున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రామ్ నట విశ్వరూపాన్ని చూపించే పాత్రను బోయపాటి మలుస్తున్నాడు. దీంతో రామ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా రామ్ కెరీర్ లో ఈ సినిమా హైలెట్ గా నిలవనుంది.