Pavitra Lokesh: నరేష్ తో రిలేషన్.. టాలీవుడ్ లో పవిత్ర కెరీర్ ముగిసినట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రా లోకేష్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.. నటుడు నరేష్ తో నాలుగో పెళ్ళికి సిద్ధం అంటూ వచ్చిన వార్తలతో పవిత్రా లోకేష్ పేరు బయటికి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమె పేరు నెట్టింట మారుమ్రోగిపోతోంది. నరేష్ తో రిలేషన్,
నరేష్ మీడియా ముందుకు రావడం, నరేష్ మూడో భార్య రమ్య ఆమెపై చేసిన ఆరోపణలు.. ఆ తరువాత నరేష్, పవిత్ర ఒకే హోటల్ లో కనిపించడం.. ఇలా పవిత్రా పేరు ట్రెండింగ్ లోకి మారిపోయింది. నరేష్ తనకు మంచి స్నేహితుడని, అతడికి తోడుగా ఎప్పటికి ఉంటానని పవిత్రా చెప్పుకు రావడం విశేషం.. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. నరేష్ తో రిలేషన్ ఆమె కెరీర్ ను తొక్కేసిందా..? అంటే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంత తతంగం జరిగాకా ఆమెకు అవకాశాలు రావడం దేవుడు ఎరుగు.. వచ్చితిన్ అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయని టాక్ నడుస్తోంది.
పవిత్రా టాలీవుడ్ లో స్టార్ నటి. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె నటనకు గుర్తింపు ఉంది. నటిగా ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ గొడవ తరువాత ఆమెపై ఉన్న అభిమానం చాలామందికి తగ్గింది అంటున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో సైతం ఒక వ్యక్తిత్వం ఉన్న తల్లి పాత్రను ఇవ్వడానికి మొగ్గుచూపడం లేదని, ఇప్పటికే ఆమెను రెండు పెద్ద సినిమాల నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ముందు ముందు పవిత్రా కెరీర్ ముగిసినట్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంపై పవిత్ర ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!