NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Dragon: యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా ‘డ్రాగన్’ సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కథకు ప్రాణమైన ఈ చివరి ఘట్టాన్ని సాధారణ స్థాయి కాకుండా, విజువల్ వండర్లా తెరపైకి తెచ్చేందుకు చిత్ర యూనిట్ భారీగా కసరత్తు చేస్తోందట. ఈ విధ్వంసకర క్లైమాక్స్ ఫైట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కళ్లుచెదిరే రీతిలో ప్రత్యేకమైన ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఫైట్ కోసమే చిత్ర బృందం బడ్జెట్‌ను ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్ మొదటి వారం నుంచే ఈ హై-వోల్టేజ్ క్లైమాక్స్ చిత్రీకరణను మొదలుపెట్టేందుకు మేకర్స్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో, విలన్స్ మధ్య సాగే ఈ పోరు థియేటర్లలో ప్రేక్షకులకు ప్యూర్ మాస్ ఎనర్జీని, గూస్బంప్స్ అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. క్లైమాక్స్ ఫైట్ షూట్ పూర్తయిన వెంటనే సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచే భారీ పాటను సైతం అదే జోరులో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటతో సినిమా మేజర్ చిత్రీకరణ దాదాపు ఓ కొలిక్కి రానుంది. ఒకవైపు అదిరిపోయే క్లైమాక్స్ ఫైట్, మరోవైపు గ్రాండ్ సాంగ్‌తో ‘డ్రాగన్’ టీమ్ డిసెంబర్‌ను పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ నెలాగా మార్చేయబోతోంది. వెండితెరపై పూనకాలు తెప్పించే ఈ యాక్షన్ ట్రీట్ కోసం సినీ అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జేట్‌తో అంత్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- Nitesh Tiwari : 'రామాయణ' డైరెక్టర్‌కు అనశ్వర రాజన్'కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
- Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
- Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
- Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!