ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎలా తీసినా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. అందుకోసమే మేకర్స్.. తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెద్ద పెద్ద స్టార్ లను గెస్టులుగా పిలుస్తారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం వారి సపోర్ట్ ను ఆ సినిమాకు అందిస్తారు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టు ఎవరు రాకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రానికి పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మే 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7 శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నామని మేకర్స్ తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక పోస్టర్ పై గెస్ట్ లు ఎవరు అనేది మేకర్స్ తెలుపలేదు.. కనీసం గెస్టు వస్తున్నారు అని కూడా హింట్ ఇవ్వలేదు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎలాంటి అతిధులు లేరనన్ విషయం అర్ధమవుతుంది. ఇక దీంతో అభిమానులు తమదైన రీతిలో మహేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహేష్ బాబే సూపర్ స్టార్.. ఆయన ఈవెంట్ కు మరో సూపర్ స్టార్ అవసరమా..అని కొందరు. అసలు ఈ ఈవెంట్ లో ఎంతమంది గెస్టులు వచ్చినా అందరి చూపు మహేష్ బాబు మీదే ఉంటుంది. అలాంటప్పుడు గెస్టులు వస్తే ఎంత.. రాకపోతే ఎంత అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అంతకు ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ తదుపరి సినిమా డైరెక్టర్ రాజమౌళి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అభిమానులు అన్నదాంట్లో కూడా అతిశయోక్తి లేదు.. సూపర్ స్టార్ మహేష్ బాబే ఒక స్టార్ అయినప్పుడు మరో స్టార్ ఇంకెందుకు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.