KGF 2 : సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ ఆమెనట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం కెజిఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో కెజిఎఫ్ హీరో ఎలివేషన్లను చూపించాడు డైరెక్టర్. నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టింది ఈ సినిమా. ఇక రాఖీభాయ్ యష్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యష్ నటన ఎలా ఉంటుంది అనేది చాప్టర్ 1 లో చూసేశాం. ఇక తాజాగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో కొత్తగా చేరిన సంజయ్ దత్, రవీనా టాండన్ గురించి.. ఒక వైపు కేజీఎఫ్ ను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోవాలని చూసే అధీరా పాత్రలో సంజయ్ దత్.. మరోవైపు రాఖీకి అడ్డుకట్ట వేయాలని చూసే ఇందిరాగాంధీ తరహా రాజకీయ నేత పాత్రలో రవీనా టాండన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. మరీముఖ్యంగా సినిమా మొత్తానికి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ .. రవీనా టాండన్ అని అంటున్నారు ప్రేక్షకులు.
రాజకీయ నేత రమిక సేన్ గా ఆమె నటన ఆకట్టుకుంటుందని, రాఖీ భాయ్ కి, ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. రవీనాకు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. బాలీవుడ్ సినిమాల్లో రవీనా ఛాలెంజింగ్ పాత్రలు ఎన్నో చేసి మెప్పించింది. పాత్రకు తగ్గట్టే ఆమె నటించి మెప్పించింది. ప్రశాంత్ నీల్ సైతం పాత్రలకు తగ్గట్టే క్యాస్టింగ్ ఎంచుకోవడం సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. ఇక సంజయ్ దత్ సైతం ఇంటర్వ్యూలో తనకు రవీనా టాండన్ నటన చాలా బాగా నచ్చిందని, ఆమె చేసిన నటన చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. దీంతో ఆమె పాత్రపై హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నట్లుగానే ఆమె నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇంకోపక్క సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేదని అంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 లో ఎటువంటి స్టార్లు లేకపోయినా కథే బలంగా ఉందని, చాప్టర్ 2లో స్టార్లు ఉన్నా కథ అంత బలంగా లేదని చెప్పుకొస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు పేలవంగా అనిపించాయని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
- Suriya: ‘‘ఈ సక్సెస్ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!