CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. అయితే, కొన్ని చోట్ల రెబల్స్ బెడద తప్పలేదు.. అయితే, రెబల్స్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని నేతలకు సూచించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో వాటిని ఉపసంహరించుకునేలా చూడాలని ఆదేశించారు. పార్టీ అధికారికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు త్వరగా బీ-ఫారాలు అందించాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ముందుకు వెళ్లేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మూడు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఎవరికి వారు స్వతంత్రంగా నామినేషన్లు వేయడం సరైన పద్ధతి కాదని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమిలో భాగంగా ఏ పార్టీకి ఏ స్థానాన్ని కేటాయించారో, ఆ స్థానంలో నిలబెట్టిన అభ్యర్థి విజయానికి మిగతా నేతలు కూడా కృషి చేయాలని సూచించారు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా పార్టీల బలాబలాలను అంచనా వేయాలని, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం అభ్యర్థులను నిలబెట్టవద్దని స్పష్టం చేశారు.
Also Read
- AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
- Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
- YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
ఇంటింటి ప్రచారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో బూత్ స్థాయి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఉంటేనే నాయకులుగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే ఎన్నికలు పార్టీ నేతల పనితీరుకు పరీక్షగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని స్థానాల్లోనూ గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రేట్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఎన్నికలయ్యే వరకు పార్టీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు
ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ముఖ్యమంత్రిగానే కాకుండా, పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యకర్తల్లా పనిచేయాలని సూచించారు. విలువలు లేకుండా చేసే రాజకీయాలు, రౌడీయిజం, అధికార దుర్వినియోగంతో సాగించే రాజకీయాలు ఎప్పటికీ నిలబడవని వ్యాఖ్యానించారు. ప్రజల్లో గుర్తింపు ఉన్నవారిని, ప్రజలు ఆమోదించిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నేతలకు సూచించారు.
11 కార్పొరేషన్లు.. 11 సామాజిక వర్గాలకు కేటాయింపు
అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 11 కార్పొరేషన్లను 11 సామాజిక వర్గాలకు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వేలాది మందికి ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో సమర్థులైన నాయకులు లేకపోతే అక్కడ పార్టీ బలహీనపడుతుందని, ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకులను ఎంపిక చేసుకుంటే పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు కల్పించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమని చంద్రబాబు పేర్కొన్నారు. వేలాది మంది కార్యకర్తలకు ఈ ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, పొత్తులు, సామాజిక సమీకరణాల కారణంగా కొందరికి సీట్లు కేటాయించలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. అలాంటి వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మొత్తంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యత, అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ, పార్టీ శ్రేణుల సమన్వయంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేటాయించిన స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులను గెలిపించేందుకు నేతలంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!