AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadarsha Kutumbam Release Date Out: విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’ విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. దీంతో వెంకటేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం 47 చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించారు. గతంలో ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడటంతో.. అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో అక్టోబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.
Also Read
- Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
- SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. 'వారణాసి'పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- 418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న '418' ట్రైలర్!
- Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. నారా రోహిత్, రావు రమేశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబ కథలకు ప్రాధాన్యం ఇచ్చే వెంకటేశ్ ఓవైపు.. తనదైన సంభాషణలు, కథనంతో గుర్తింపు పొందిన త్రివిక్రమ్ మరోవైపు ఉండడంతో ఆదర్శ కుటుంబంపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఆదర్శ కుటుంబం అందుకుంటుందో లేదో చూడాలి. ఇక విడుదల తేదీ అధికారికంగా ప్రకటించడంతో సినిమా ప్రమోషన్లు మొదలు కానున్నాయి.
తాజావార్తలు
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!