The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ పురాణాలు, అంతుచిక్కని రహస్యాలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కలయికతో సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ‘ఆర్విహా క్రియేషన్స్’ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి చిత్రంగా తెరకెక్కిస్తున్న ‘ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్’ టైటిల్‌ను 2026 దసరా పండుగ సందర్భంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కథా ప్రపంచంతో ఈ సినిమా రూపొందుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
‘ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్’ అనే టైటిల్‌తోనే చిత్ర బృందం కథపై ఆసక్తిని రేకెత్తించింది. ఇందులోని ‘రైజ్ ఆఫ్ మహావీర్’ అనే ఉపశీర్షిక కథలోని కీలక పాత్ర, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలపై ఉత్కంఠను పెంచుతోంది. పోస్టర్ ద్వారా సినిమా నేపథ్యంపై సంకేతాలు ఇచ్చింది. భారతీయ పురాణాల్లోని అంశాలను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏఐ ఆధారిత కథా ప్రపంచం, ఫ్యూచరిస్టిక్ అంశాలు, మైథలాజికల్ మిస్టరీ కలయికతో ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.
Also Read
- SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
- AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
- Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
- SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. 'వారణాసి'పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నిర్మాత నరేష్ గౌడ్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల దర్శకత్వం వహిస్తున్నారు. జి.సి. శేఖర్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువ ప్రతిభ, వినూత్నమైన కథా ఆలోచనలు, ఆధునిక సాంకేతికతను కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ‘ది ప్రాంప్ట్ వార్’ చిత్రాన్ని 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 3డీ వెర్షన్లోనూ రూపొందిస్తున్నారు.
తాజావార్తలు
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!