కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.. ‘మలుపు’ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమా తరువాత ‘మరకతమణి’ అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఎప్పటినుంచొ వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నా వీరు మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా 2022 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.. దీంతో వీరి ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇటీవలే ఈ జంట వివాహంతో ఒక్కటి అయ్యారు. పెళ్లి అయిన తరువాత హనీమూన్ కి చెక్కేయకుండా ఆది- నిక్కీ పవిత్ర దేవాలయాలను తిరుగుతూ మొక్కులు చెల్లిస్తున్నారు. మొన్ననే ఈ జంట తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోంది. ఇరాక్ తాజాగా వీరి పెళ్లిపై కోలీవుడ్ లో పెద్ద డిబేట్ నడుస్తోంది.
స్టార్ హీరో అయిన ఆది, హీరోయిన్ నిక్కీ దగ్గరనుంచి ఎంత కట్నం తీసుకున్నాడు..? నిక్కీ గల్రాని ఫ్యామిలీ అతగాడికి ఏమేరకు కట్టం సమర్పించుకుని ఉంటుంది? అంటూ సోషల్ మీడియాల్లో చర్చ మొదలయ్యింది. సాధారణంగా స్టార్ హీరోల పెళ్లిళ్లు అంటే కోట్లలో కట్నం.. కోట్లు విలువ చేసే ఆస్తులు ముట్టజెప్తారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆది, నిక్కీ కుటుంబం నుంచి కట్నకానుకులుగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. ఇంకా చెప్పాలంటే పెళ్లి ఖర్చులు అన్ని కూడా ఆది కుటుంబమే పెట్టుకున్నదని టాక్. అంటే నిక్కీ వద్ద డబ్బులేక కాదు.. అతడు అడిగితె నిక్కీ కుటుంబం ఎంత కట్నం కావాలన్న ఇస్తామని చెప్పారట.. అయినా మనోడు.. తనకు తాను ప్రేమించిన అమ్మాయి చాలని, డబ్బు ముఖ్యం కాదని చెప్పి తన అమ్మానాన్నలను ఒప్పించి మరీ ప్రియురాలిని పెళ్లాడట.. దీంతో ఆది మంచి మనసుకు కోలీవుడ్ ఫిదా అవుతుంది. నీలాంటి వాళ్లు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని, నీకు ఫ్యాన్స్ గ అందడం అదృష్టమని ఆది అభిమానులు ప్రశంసిస్తున్నారు.