NTR 30: పరాజయం.. ఇది రుచి చూడనివారకి దాని బాధ ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఇప్పటివరకు పరాజయం చవిచూడని వారు ఒక్కసారిగా పరాజయం పాలైతే దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పడుతోంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటివరకు ప్లాప్ లు చూడని కొరటాల ఒక్కసారిగా ఆచార్యాతో పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన నష్టం డబ్బుతోనే కాదు కొరటాల మీద ఉన్న నమ్మకాన్ని అంతా పోగొట్టిందనే చెప్పాలి. ఇక దీని ప్రభావం అతని తదుపరి సినిమాపై పడింది. జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ కాంబోగా నిలిచిన కొరటాల- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న NTR30 పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య ముందు వరకు ఈ సినిమా అదిరిపోతోంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఒక్కసారిగా ఆచార్య ప్లాప్ టాక్ అందుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. ఈ సినిమాను కనుక మంచిగా తీయకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అది తెలుసుకున్న కొరటాల శివ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడట.
అదేంటంటే.. సినిమా కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా ఉండాలని మార్పులు చేర్పులు చేస్తూ కూర్చున్నాడట. ఒకటికి రెండు సార్లు చదువుకొని ఎక్కడ తప్పు కనిపించినా మళ్లీ మొదటి నుంచి చూస్తున్నాడట. స్క్రిప్ట్ మొత్తం పకడ్బందీగా అయ్యాకే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే NTR 30 ఇంకా లేట్ అవుతూనే వస్తుంది. ఈ లెక్కన చూసుకొంటే ఇప్పట్లో ఎన్టీఆర్ తో కొరటాల సినిమా లేనట్లే కనిపిస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అందులోను మరోపక్క ఎన్టీఆర్ లుక్ కోసం కష్టపడుతున్నట్లు టాక్. ఇక ఇవన్నీ ఎప్పుడు జరిగి, ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఒక్క ప్లాప్.. డైరెక్టర్ కు ఎంత పెద్ద పాఠం నేర్పిందో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.