సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూల్ అండ్ కామ్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ అని చెప్పేస్తారు. వివాదాల జోలికి పోడు, నెగెటివ్ కామెంట్స్ చేయడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఈవెంట్ ఏదైనా మహేష్ మాత్రం మితంగానే మాట్లాడతాడు. అనవసరమైన హైప్ ఇవ్వదు.. అనవసరమైన ప్రామిస్ లు చేయడు. వేదికల మీద డైలాగ్స్, స్టెప్పులు వేసింది కూడా ఇప్పటివరకు లేదు అంటే అతిశయోక్తి లేదు. అందుకే మహేష్ ను అందరు కూల్ అండ్ కామ్ హీరో అంటారు. అయితే ఇప్పుడు మహేష్ కొద్దికొద్దిగా మారుతున్నాడా..? అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అదనుకు నిదర్శనమే సర్కారు వారి పాట చిత్రం.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నిన్న జరిగిన సక్సెస్ మీట్ వరకు మహేష్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతకముందు ఎప్పుడు కాంట్రవర్సీ కాకుండా మాట్లాడే మహేష్ ఇటీవల హిందీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే అవి సరదాగానే అన్నా.. బాలీవుడ్ లో మాత్రం ఆ వ్యాఖ్యలు సంచలనమే రేకెత్తించాయి. ఇక ఇది పక్కన్న పెడితే.. మునుపెన్నడూ లేనివిధంగా మహేష్ స్టేజిపై స్టెప్పులు వేశాడు.
‘సర్కారు వారి పాట’ సక్సెస్ మీట్ లో ఎప్పుడూ కూల్ గా ఉండే మహేష్ ఈసారి అందుకు భిన్నంగా జోష్ ని ప్రదర్శిస్తూ ‘మా మా మహేషా మాస్’ సాంగ్ కి స్టెప్పులేశారు. డ్యాన్సర్ల బృందం వేదికపై ఈ పాటకు స్టెప్పులేస్తుండగా మహేష్ ని ఆహ్వానించారు. అతడు నడిచి అలా వేదికపైకి వస్తూనే వారితో స్టెప్పు కలిపాడు. ఇక మహేష్ చెంతనే ఉన్న థమన్ సైతం అతడితో కలిసి కాలు కదిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మరీనా విషయం విదితమే. నిజం చెప్పాలంటే మహేష్ ఇలా చేయడం అభిమానులకు షాక్ అని చెప్పాలి. ఇటీవల మహేష్, అభిమానులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వారు ఏమి కావాలని కోరుకుంటున్నారో అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోపక్క సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఏదో విధంగా ప్రేక్షకులను తమ వైపు లాగడానికి కొద్దిగా మహేష్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు మరికొందరు. ఏదిఏమైనా మహేష్ లో ఈ మార్పు అభిమానులకు మాత్రం ఫుల్ కిక్కునిస్తోంది.