అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో చిరు సరసన తమిళ నాడు లేడి సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. అందుకు సంబందించి ఓ ప్రోమోను షూట్ చేసి రిలీజ్ చేసారు మేకర్స్. వచ్చే ఏడాది సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామ్ అని నయన్, అనిల్ కలిసి చెప్పిన డైలాగ్ ప్రోమోకె హైలెట్ గా నిలిచింది. గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరుకు జోడిగా నటించింది నయన్. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది నయన్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్క్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేలా వుండబోతుందనే టాక్ కూడా టాలీవుడ్ లో వినిపిస్తోంది. కాగా చిరు సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుందని సమాచారం. వినిపిస్తున్న టాక్ ని బట్టి ఏకంగా రూ. 18 కోట్లు మేర తీసుకుందనే టాక్ టాలీవుడ్ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏదేమైనా నయన్ ఉంటె ఆ క్రేజ్ వేరు. భారీ బడ్జెట్ పై తెరెకెక్కుతున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.