లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూవీ ‘కనెక్ట్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ముందెన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార ఒక యంగ్ హీరోయిన్ కి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది మాళవిక మోహనన్ గురించి. రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, సెకండ్ సినిమానే దళపతి విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్, ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో “నేను ఒక సీన్ చూసాను, అందులో హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంది. పేషంట్ లా ఉండాల్సిన హీరోయిన్, మేకప్ వేసుకోని ఉండడం ఏంటో అర్ధం కాలేదు. అది కమర్షియల్ సినిమా అని తెలుసు కానీ కొంచెం అయినా రియలిస్టిక్ గా ఉండాలి కదా” అంటూ ఇండైరెక్ట్ గా నయనతార గురించి కామెంట్స్ చేసింది.
ఈ కామెంట్స్ అటు తిరిగి ఇటు తిరిగి నయనతార వరకూ వెళ్లడంతో ఇప్పుడు నయన్, మాళవిక మోహనన్ కి కౌంటర్ వేసింది. “నేనొక ఇంటర్వ్యూ చూసాను, అందులో ఒక హీరోయిన్ నా పేరు చెప్పలేదు కానీ తను చెప్పింది నా గురించే. అందులో హాస్పటల్ సీన్ లో నటించింది నేను, అయితే ఇప్పుడు హాస్పిటల్ సీన్ అనగానే జుట్టు అంతా చెరిపేసుకోని బెడ్ పైన పడుకోవాలనేమి లేదు. హాస్పటల్ స్టాఫ్ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పైగా అది ఆర్ట్ సినిమా కాదు కమర్షియల్ సినిమా. నా డైరెక్టర్ ఎలా చెయ్యమంటే అలానే చేశాను, కమర్షియల్ సినిమాలో మరీ అంత మెలోడ్రామా ఉండాల్సిన అవసరం లేదు” అంటూ నయన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూ చూసిన కొంతమంది మాళవిక మోహనన్ కి సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమందేమో నయనతారకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో నయనతారకి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది, మాళవిక మోహనన్ కి ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ వస్తుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వివాదాలు మాళవిక మోహనన్ కెరీర్ ని కష్టాల్లో పడేసే విషయాలే. మరి ఇది ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.