Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి వస్తున్న జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ను ప్రకటించారు. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని హెచ్. వినోడ్ డైరెక్ట్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ నుంచి వస్తున్న చివరి మూవీ ఇది. అందుకే మూవీని గ్రాండ్ గా తీస్తున్నారంట.
read also : Dhanush : థియేటర్ లో ఏడ్చేసిన ధనుష్..
విజయ్ పొలిటికల్ ఎంట్రీని దృష్టిలో పెట్టుకుని రాజకీయ అంశాలతో మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను తమిళ రాజకీయాల్లో కీలకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇది ప్లస్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ కు తెలుగునాట కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మూవీ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తో మూవీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు.
read also : Shekar Kammula : శేఖర్ కమ్ముల మూవీలు.. సోషల్ మెసేజ్ లు..!